prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 07 September 2026, 2:55 pm Digital Edition : PRAJA KSHETRAM

యూ–టర్న్‌ మూసివేతపై ప్రజల ఆగ్రహం

నాగారం, సెప్టెంబరు 07(ప్రజాక్షేత్రం):ఘాట్కేసర్‌ సర్కిల్‌ పరిధిలోని నాగారం డివిజన్‌ ప్రధాన రహదారిలో రాఘవేంద్ర హోటల్‌ వద్ద యూ–టర్న్‌ను మూసివేసి గ్రిల్స్‌ ఏర్పాటు చేయడంతో స్థానికులు, కాలనీ వాసులు, మహిళలు, పాఠశాల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సోమవారం ట్రాఫిక్‌ పోలీసులతో ప్రజలు వాగ్వాదానికి దిగారు. గ్రిల్స్‌ పూర్తిగా ఏర్పాటు చేయడంతో పాదచారులు సైతం రహదారి దాటేందుకు అవకాశం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, విద్యార్థులు, స్థానికులు రహదారి అవతలి వైపునకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో గ్రిల్స్‌లో తగినంత ఖాళీ ఉంచడంతో పాటు పాదచారులు సురక్షితంగా రోడ్డు దాటేందుకు ప్రత్యేక మార్గం ఏర్పాటు చేయాలని ట్రాఫిక్‌ పోలీసులను కోరారు. ప్రజల ఇబ్బందులను గుర్తించిన ట్రాఫిక్‌ సీఐ స్పందిస్తూ.. రాఘవేంద్ర హోటల్‌ వద్ద మంగళవారమే పాదచారుల మార్గం ఏర్పాటు చేసి, మహిళలు, పిల్లలు, ప్రజలు సురక్షితంగా రహదారి దాటేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.