రైతు సమస్యలపై బీఆర్‌ఎస్ ధర్నా
రైతు సమస్యలపై బీఆర్‌ఎస్ ధర్నా శంకర్‌పల్లి, సెప్టెంబరు 03(ప్రజాక్షేత్రం):కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో గురువారం శంకర్‌పల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్, మండల ప్రజాపరిషత్ కార్యాలయాల ఎదుట ధర్నా నిర్వహించారు. మండలంలోని వివిధ గ్రామాల నుంచి రైతులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మండల బీఆర్‌ఎస్ అధ్యక్షుడు గండిచర్ల గోవర్దన్‌రెడ్డి, మున్సిపల్ అధ్యక్షుడు, సొసైటీ ఛైర్మన్ బద్దం శశిధర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఆందోళనలో 22(ఎ) నిషేధిత భూముల సమస్య పరిష్కారం,...