prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 17 September 2026, 8:52 am Digital Edition : PRAJA KSHETRAM

లంచం తీసుకుంటుండగా కీసర ఎస్‌ఐ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టివేత

  • రూ.10 లక్షల లంచం డిమాండ్‌ ఆరోపణలు.. కీసర పోలీసులపై ఏసీబీ దాడులు
  • రూ.5 లక్షల లంచం తీసుకుంటూ కీసర ఎస్‌ఐ ఏసీబీకి చిక్కిన వైనం

కీసర, సెప్టెంబర్ 17(ప్రజాక్షేత్రం):మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా కీసర పోలీస్‌స్టేషన్‌లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు గురువారం సోదాలు నిర్వహించారు. రూ.5 లక్షల లంచం తీసుకుంటున్న కీసర ఎస్‌ఐ జ్ఞానేందర్‌రెడ్డిని ఏసీబీ అధికారులు పట్టుకున్నట్లు సమాచారం. కీసర చెరువు వద్ద కారులో నగదు తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు తెలిసింది. ఓ కేసులో నిందితుడికి స్టేషన్‌ బెయిల్‌ ఇప్పించేందుకు రూ.10 లక్షలు డిమాండ్‌ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇందులో భాగంగా రూ.5 లక్షలు ఎస్‌ఐకి ఇచ్చేలా ఒప్పందం కుదిరినట్లు సమాచారం. కొంతకాలంగా పోలీసుల వేధింపులతో ఇబ్బందులు పడుతున్న బాధితుడు ఏసీబీని ఆశ్రయించినట్లు తెలుస్తోంది. గణేశ్‌ నిమజ్జనం విధుల్లో ఉన్న సమయంలోనే ఎస్‌ఐ లంచం తీసుకున్నట్లు సమాచారం. ఈ వ్యవహారంలో కీసర ఇన్‌స్పెక్టర్‌ ఆర్కపల్లి ఆంజనేయులు పాత్రపైనా ఏసీబీ అధికారులు దృష్టి సారించినట్లు తెలిసింది. పోలీస్‌స్టేషన్‌తో పాటు సంబంధిత అధికారుల ఇళ్లలోనూ తనిఖీలు కొనసాగుతున్నాయి. ఏసీబీ డీఎస్పీ మజీద్‌ అలీఖాన్‌ ఆధ్వర్యంలో ఈ సోదాలు జరుగుతున్నట్లు సమాచారం.