లింగమయ్య జాతరకు సర్వం సిద్ధం ..!
- వేల సంఖ్యలో పాల్గొననున్న భక్తులు
- ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ఆలయ కమిటీ సభ్యులు
- ప్రత్యేక పూజలు చేయనున్న ఆలయ పునర్నిర్మాణకర్త ముమ్మలనేని రాజశేఖర్ దంపతులు
కోటగిరి, సెప్టెంబర్ 14(ప్రజాక్షేత్రం):కోటగిరి మండలం లింగాపూర్ గ్రామ శివారులోని అడికేశ్ లింగమయ్య ఆలయంలో ప్రతియేటా వినాయక చవితి మరుసటి రోజు నిర్వహించే మహా జాతర మంగళవారం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ లింగమయ్య జాతరలో వేల సంఖ్యలో భక్తులు పాల్గొననున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు అంచనా వేస్తున్నారు. అంచనాకు మించి భక్తులు వచ్చినా భక్తులకు అసౌకర్యం కలవద్దని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. లింగమయ్య జాతర సందర్భంగా బోధన్ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఎన్ఎస్ఎస్, ఎన్ సీ సీ విద్యార్థులు వాలంటీర్లుగా విధులు నిర్వహించనున్నారు. వందల సంవత్సరాల క్రితం ఈ దట్టమైన అడవి కొండల మధ్య శివలింగం వెలిసింది. ఈ లింగానికి స్వయంగా గొడ్డు అవు వచ్చి తన పాలతో శివలింగాన్ని క్షీరాభిషేకం చేసేదని ఈ ప్రాంతంలో ఋషులు సైతం తపస్సులు చేశారని పురాణాలు చెప్తున్నాయి. ఈ పుణ్యక్షేత్రం గురించి స్థానికుల ద్వారా తెలుసుకున్న బస్వాపూర్ గ్రామానికి చెందిన హైదరాబాద్ రియల్ స్టేట్ వ్యాపారవేత్త ముమ్మలనేని రాజశేఖర్ కోట్ల రూపాయలతో ఆలయ పునర్నిర్మానం చేసి ఆలయ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఈ ఆలయం వద్ద వందల సంవత్సరాల నుండి వినాయక చవితి మరుసటి రోజున పెద్ద ఎత్తున జాతర జరుపుతుంటారు. ఈ జాతరకు ఈ ఆలయ చుట్టుప్రక్కల గ్రామాల భక్తులతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్ నుండి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొంటారు. ముమ్మలనేని రాజశేఖర్ కోట్ల రూపాయలతో పునర్నిర్మానం చేసి ఆలయ పక్కన 25 అడుగుల ఆదియోగి విగ్రహం ఏర్పాటు చేసి ఆలయానికి వెళ్లే రోడ్డుకు ఇరుప్రక్కల పూల మొక్కలు నాటి చుట్టూ కొండలు దట్టమైన అడవుల మధ్య అలహాదాకరమైన వాతావరణం తీర్చిదిద్దారు. ఆలయం వద్ద భక్తులకు కావలసిన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఆలయ కమిటీకి చైర్మన్ గా ఉండి ఆలయ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఆలయం వద్ద భక్తుల సౌకర్యార్థం అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది .ప్రతియేటా ఆలయంలో నిర్వహించే జాతరకు భక్తుల రద్దీ పెరుగుతూ వస్తుంది. ఆలయపున నిర్మాణం పూర్తవటం, ఇటీవల సోషల్ మీడియాలో ఆది యోగి విగ్రహం, అడికేష్ లింగమయ్య ఆలయం గురించి పెద్ద ఎత్తున ప్రచారం జరగటం, లింగమయ్య మహిమలను భక్తులు విశ్వసించడంతో ఈసారి జాతరకు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొంటారని అంచనా వేస్తున్న ఆలయ కమిటీ చైర్మన్ ముమ్మల నేని రాజశేఖర్ ఆలయం వద్ద విశాలంగా మైదానం ఏర్పాటు చేశారు. జాతర జరిగే ప్రాంతంలో పరిసరాలని శుభ్రం చేయించారు. భక్తులకు ఎలాంటి ఆటంకాలు రాకుండా అన్ని వసతులను ఏర్పాటు చేశారు. ఈ లింగమయ్య జాతరలో పునర్నిర్మానం చేసిన ఆలయ కమిటీ చైర్మన్ ముమ్మలనేని రాజశేఖర్ పద్మశ్రీ వీణ దంపతులు కుటుంబ సభ్యులు పాల్గొననున్నారు. ఈ జాతరకు కోటగిరి పోలీసులు సైతం ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ అడికేష్ లింగమయ్య మహా జాతరలో భక్తులు పెద్ద సంఖ్యలో లింగమయ్య ను దర్శించుకొని శివయ్య కృపకు పాత్రులు కావాలని ఆలయకమిటీ సభ్యులు కోరారు.

