వాడవాడలా కొలువైన గణనాథుడు
భక్తిశ్రద్ధలతో వినాయక చవితి వేడుకలు ముస్తాబైన మండపాలు..కనువిందు చేస్తున్న విద్యుత్ దీపాలంకరణలు ఉత్సవాలకు సర్వం సిద్ధం చేసిన నిర్వాహకులు యువతలో వెల్లివిరుస్తున్న ఉత్సాహం…గ్రామాల్లో పండుగ శోభ పెద్దేముల్, సెప్టెంబర్ 14(ప్రజాక్షేత్రం):విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడు వాడవాడలా కొలువుదీరాడు.వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని పెద్దేముల్ మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో గణనాథుడి విగ్రహాలను సోమవారం ఘనంగా ప్రతిష్ఠించారు.భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ గణపయ్యను కొలుస్తున్నారు.దీంతో మండలంలోని పల్లెలన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.వినాయక చవితి నేపథ్యంలో కొద్ది రోజులుగా మండపాల ఏర్పాట్లు, అలంకరణలు, విద్యుత్ దీపాల అమరిక...