వివక్షత, అసమానతలు, పేదరిక నిర్మూలనకై ఉద్యమిస్తాం.
మాకు రాజకీయంగా శాశ్వత మిత్రులు లేరు, శాశ్వత శత్రువులు లేరు. అక్టోబర్ 7 న అమరావతి లో 1200 మండల కమిటీల జాతీయ సదస్సు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు 'పద్మశ్రీ' మంద కృష్ణ మాదిగ. హనుమకొండ సెప్టెంబర్ 09(ప్రజాక్షేత్రం):శతాబ్దాల తరబడి భారతీయ సమాజాన్ని పట్టి పీడిస్తున్న కుల, వర్గ, మత,లింగ, వివక్షతలను నిర్మూలించడం కోసం అలాగే సామాజిక ఆర్థిక రాజకీయ అసమానతలను తొలగించడానికై మరియు పేదరిక నిర్మూలన కోసం ఎమ్మార్పీఎస్ అధ్వర్యంలో భవిష్యత్తు పోరాటాలు చేపడతామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మంద కృష్ణ...