prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 06 September 2026, 4:59 pm Digital Edition : PRAJA KSHETRAM

వెయ్యి రోజుల పాలనపై పల్లెల విధ్వంసం.

వెయ్యి రోజుల పాలనపై పల్లెల విధ్వంసం.

  • పడకేసిన పారిశుధ్యం పై నిరసన.
  • దగా కోరు కాంగ్రెస్ ను‌ పాతరేద్దాం.
  • ప్రజా వ్యతిరేక పాలనను తరిమేద్దాం.
  • తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి.

యాలాల సెప్టెంబర్ 6(ప్రజాక్షేత్రం):యాలాల మండలంలోని లక్ష్మీ నారాయణపూర్ కూడలిలో వెయ్యి రోజుల పాలనపై పల్లెల విధ్వంసం పడకేసిన పారిశుద్ధంపై నిరసన కార్యక్రమాన్ని బీఆర్ఎస్ మండల అధ్యక్షులు సి. రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ.. తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి స్థానికుడు కాకపోవడంతో తాండూరును పట్టించుకోవడం లేదన్నారు. లక్ష్మీ నారాయణపూర్ యాలాల రోడ్డు దుస్తితి వల్ల ప్రజల ప్రాణాలు పోతున్నాయన్నారు. పల్లెల్లో పారిశుధ్యం సరిగా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, కనీసం చెత్తను తొలగించే పరిస్థితి కూడా లేకుండా పోయిందని విమర్శించారు.కాంగ్రేస్ అదికారంలోకి వస్తే వంద రోజుల్లో హామీలను అమలు చేస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. కాంగ్రేస్ పాలనకు వెయ్యి రోజులు పూర్తిచేసుకున్నా, ఇచ్చిన హామీలు మాత్రం అమలు కావడం లేదని చెప్పారు. విద్యార్థులకు ఐదు లక్షలు భరోసా కార్డు, కళాశాల విద్యార్థినులకు ఉచిత స్కూటీలు, అర్హులైన నిరుద్యోగ యువతకు నెలకు రూ. 4 వేల నిరుద్యోగ భృతి, అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ వంటి హామీలను ప్రభుత్వం విస్మరించిందని తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ లు, ఫీజు రియంబర్స్మెంట్ కు సంబంధించిన రూ.11 వేల కోట్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మన్ వడ్డే రాములు, మాజీ జడ్పిటిసి సిద్రాల శ్రీనివాస్, ఏఎంసీ మాజీ ఉపాధ్యక్షుడు అనంతయ్య , ఉపాధిహామీ స్టేట్ కౌన్సిల్ మాజీ సభ్యులు ఆకుల శివకుమార్, మాజీ సర్పంచ్ రవి గౌడ్, మాజీ వైస్ ఎంపీపీ పి. రమేష్, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు మల్లారెడ్డి, టిఆర్ఎస్ నాయకులు శేఖర్ రెడ్డి, జె. శ్రీనివాస్ గౌడ్, లాలు, శరణు, అక్కంపల్లి నారాయణ, ఏఎంసీ మాజీ డైరెక్టర్లు ముస్తఫా, మంత్రి వెంకటయ్య, యువ నాయకులు సాయి కిరణ్, మెట్టి కృష్ణ, సీనియర్ నాయకులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు.