శంకర్‌పల్లి, సెప్టెంబర్ 20(ప్రజాక్షేత్రం):శంకర్‌పల్లి మండల కేంద్రంలోని ఎల్వర్తి మూలమలుపు వద్ద ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. దుర్గమ్మ ఆలయం సమీపంలో ఓ కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కారు డ్రైవర్ మద్యం మత్తులో ఉండటంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. వేగంగా వస్తున్న కారు ఒక్కసారిగా అదుపు తప్పి డివైడర్‌ను బలంగా ఢీకొంది. కారులో నలుగురు ప్రయాణికులు మరియు ఒక 5 సంవత్సరాల బాలుడు ఉన్నట్లు సమాచారం. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని, అందరూ సురక్షితంగా బయటపడ్డారని స్థానికులు తెలిపారు. కారు ముందు భాగం స్వల్పంగా దెబ్బతింది. స్థానికులు వెంటనే స్పందించి కారులో ఉన్న వారిని బయటకు తీశారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, నిర్లక్ష్యం ప్రాణాలకే ముప్పు అని స్థానికులు హెచ్చరిస్తున్నారు.