శ్రీకృష్ణ జన్మాష్టమి

శ్రీకృష్ణ జన్మాష్టమి మేనమామ గండమని ఆకాశవాణి పలికెన్ –ఆ మాట విని కంసుని గుండె రగిలెన్!చరసాలే జన్మస్థానమై,దేవకీ గర్భమున శ్రీహరి అవతరించెన్! వసుదేవుని వెంట రేపల్లెకు పయనమై,యశోదమ్మ ఒడిలో ఒదిగెను బాలుడై;నందుని ఇంట నీలమేఘ శ్యాముడై,బాలకృష్ణుడై అందరి మనసులు గెలిచెన్! అమ్మలక్కల గోలతో వెన్నదొంగగా మారెన్,చిలిపి చేష్టలతో అందరినీ మురిపించెన్;మట్టి తిన్నాడని యశోదమ్మ మందలించగా,చిట్టి నోటిలో జగమంతా చూపించెన్! కాళీయుని పడగలపై నాట్యమాడి,నాగమదమును అణచివేసి;యమునా తీరాన దివ్యరూపమై,మహావిష్ణు అవతారమని చాటెన్! చిటికెన వేలితో గోవర్ధనమెత్తి,గోవులనూ గోపాలులనూ కాపాడి;గోవర్ధనధారియై కీర్తిని పొందెను,గోపాలకృష్ణుడై వెలుగొందెను! మురళీ గానంతో...