prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 06 September 2026, 5:02 pm Digital Edition : PRAJA KSHETRAM

సుచిత్రలో మార్కెట్లో ‘శ్రీ’ గ్రాండ్ ఎంట్రీ

సుచిత్రలో మార్కెట్లో ‘శ్రీ’ గ్రాండ్ ఎంట్రీ

  • రెండేళ్లలో తెలంగాణలో 25 స్టోర్ల ఏర్పాటు లక్ష్యం.
  • ఆన్‌లైన్ హిట్..ఇప్పుడు ఆఫ్‌లైన్‌లో ‘శ్రీ’ హిట్.

కుత్బుల్లాపూర్, సెప్టెంబర్ 06(ప్రజాక్షేత్రం):మహిళల ఎత్నిక్ వేర్ బ్రాండ్ ‘శ్రీ’ హైదరాబాద్ లోని సుచిత్రలో రిటైల్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. సుచిత్ర లోని టీఎన్ఆర్ నార్త్ సిటీ మాల్‌లో ఏర్పాటు చేసిన తొలి స్టోర్‌ను ఫెమినా మిస్ ఇండియా తెలంగాణ–2026 రమ్య కైలాసా, సంస్థ సహ వ్యవస్థాపకులు సందీప్ కపూర్, శీతల్ కపూర్ ప్రారంభించారు. ఆన్‌లైన్‌లో తెలంగాణలో ఇప్పటికే మంచి ఆదరణ పొందిన ‘శ్రీ’.. రాబోయే రెండేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 20 నుంచి 25 స్టోర్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. విస్తరణతో పాటు స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పించడం, టైలరింగ్, హస్తకళా రంగాల్లోని ప్రతిభను ప్రోత్సహించడంపై దృష్టి సారిస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. మహిళల రోజువారీ అవసరాలు, ఉద్యోగం, వేడుకలకు అనుగుణంగా సౌకర్యవంతమైన ఫిట్టింగ్‌తో దుస్తులను రూపొందిస్తున్నట్లు సహ వ్యవస్థాపకురాలు శీతల్ కపూర్ తెలిపారు. స్టోర్‌లో చీరలు, కుర్తాలు, కుర్తా సెట్లు, కుర్తీలు, ట్యూనిక్స్, కో-ఆర్డ్స్, వైడ్ లెగ్ ప్యాంట్లు, లెగ్గింగ్స్ తదితర ఎత్నిక్ వేర్ కలెక్షన్ అందుబాటులో ఉంది. జాతీయ స్థాయిలో 25 లక్షలకు పైగా కుటుంబాలకు చేరువైన ‘శ్రీ’.. 75 లక్షలకు పైగా దుస్తులను విక్రయించినట్లు సంస్థ వెల్లడించింది. సొంత వెబ్‌సైట్‌తో పాటు ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలోనూ బ్రాండ్ అందుబాటులో ఉంది. హైదరాబాద్ స్టోర్‌తో తెలంగాణలో ఆఫ్‌లైన్ మార్కెట్‌ను మరింత విస్తరించేందుకు సంస్థ సిద్ధమవుతోంది.