హామీల అమలుకు తక్షణ చర్యలు తీసుకోవాలి
హామీల అమలుకు తక్షణ చర్యలు తీసుకోవాలి సెప్టెంబరు 10న ‘చలో హైదరాబాద్’ విజయవంతం చేయాలి. హైదరాబాద్, సెప్టెంబరు 06(ప్రజాక్షేత్రం):ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంతోపాటు వారి న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ సహకార గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం అధ్యక్షుడు ఏ.జగన్మోహన్‌రావు, ప్రధాన కార్యదర్శి డా.డి.భీంరాజ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం సెప్టెంబరు 10న నిర్వహించనున్న ‘చలో హైదరాబాద్’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. గచ్చిబౌలిలోని టీఎన్జీవోల కాలనీ ఆత్మీయ భవన్‌లో ఆదివారం నిర్వహించిన రాష్ట్ర విస్తృత స్థాయి కార్యవర్గ...