
100 మంది గర్భిణులకు సీమంతం
చర్లపల్లి, సెప్టెంబరు 6(ప్రజా క్షేత్రం): కాప్రా సర్కిల్ పరిధిలోని చర్లపల్లి డివిజన్లోనీ ఆక్స్‌ఫర్డ్ గ్రామర్ స్కూల్ చైర్మన్ గడ్డం యాదగిరి జన్మదినం సందర్భంగా 100 మంది గర్భిణులకు సీమంతం నిర్వహించారు. మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరై గర్భిణులను ఆశీర్వదించారు. పౌష్టికాహారం తీసుకోవాలని, వైద్యుల సూచనలు పాటించాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో వైద్యులు, పోలీసు అధికారులు, ప్రజాప్రతినిధులు, అంగన్‌వాడీ సిబ్బంది పాల్గొన్నారు.