కుషాయిగూడలో హెబ్బా పటేల్ సందడి
- చెన్నై షాపింగ్ మాల్ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన సినీ నటి కాప్రా, సెప్టెంబర్ 27(ప్రజాక్షేత్రం):కాప్రా సర్కిల్ పరిధిలోని కుషాయిగూడ శ్రీలక్ష్మీ కన్వెన్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన చెన్నై షాపింగ్ మాల్ ఎగ్జిబిషన్‌కు టాలీవుడ్ నటి హెబ్బా పటేల్ ముఖ్య అతిథిగా హాజరై సందడి చేశారు. జ్యోతి ప్రజ్వలన చేసి ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా హెబ్బా పటేల్ మాట్లాడుతూ చెన్నై షాపింగ్ మాల్ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ అవసరమైన దుస్తులు, వస్త్రాలు ఒకే చోట అందుబాటులో ఉండటం సంతోషకరమన్నారు....