prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 28 September 2026, 12:13 pm Digital Edition : PRAJA KSHETRAM

ఎన్కేపల్లి జీ,పి, లో నిధుల దుర్వినియోగంపై చర్యలు తీసుకోవాలి.

ఎన్కేపల్లి జీ,పి, లో నిధుల దుర్వినియోగంపై చర్యలు తీసుకోవాలి.

  • ఎంపీడీవోకు వినతి పత్రం అందజేత.
  • స్థానిక సర్పంచ్ స్వరూప వెంకటేష్.

యాలాల సెప్టెంబర్ 28(ప్రజాక్షేత్రం):గ్రామ అభివృద్ధి కొరకు వినియోగించే గ్రామపంచాయతీ నిధులను దుర్వినియోగం చేసిన వారిపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని సర్పంచ్ స్వరూప అన్నారు. మండల పరిధిలోని ఎన్కేపల్లి గ్రామపంచాయతీ నిధులను దుర్వినియోగం చేసిన పంచాయతీ సెక్రెటరీ శేఖర్, ఉప సర్పంచ్ రామప్ప పై చర్యలు తీసుకోవాలని సోమవారం యాలాల మండల కార్యాలయంలో ఎంపీడీవోకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంచాయతీ కార్యదర్శి, ఉపసర్పంచ్ ఇద్దరు కలిసి గ్రామపంచాయతీ లోనే లేని మద్దూర్ వెంకటేష్ పేరు మీదుగా రూ. 4500, బ్లీచింగ్ పౌడర్ కొనుక్కున్న కొన్నట్లు రూ. 30,000, జెసిబి రోడ్ వర్క్ నడిచినట్లు రూ.15,000 లను సర్పంచ్ కు తెలియకుండా డ్రా చేసుకున్నారన్నారు. సర్పంచుకు ఓటీపీలు అడగకుండానే నిధులు డ్రా చేసుకొని దుర్వినియోగం చేశారన్నారు. గ్రామానికి చెందిన ఈడికి దస్తయ్య నిర్మించుకుంటున్న కొత్త ఇంటి పర్మిషన్ కొరకు సర్పంచుకు తెలియకుండా పర్మిషన్ ఇప్పించారన్నారు. గ్రామానికి చెందిన గొల్ల ఎల్లప్ప రోడ్డులో అక్రమంగా నిర్మించిన బాత్రూం నిర్మాణానికి డ్రైనేజీ ఏర్పాటు కోసం గ్రామసభ పని గుర్తింపు, వర్క్ ఆర్డర్ లేకుండా డ్రైనేజీ నిర్మాణానికి రూ.10,000 ఇవ్వాలని పంచాయతీ కార్యదర్శి ఉప సర్పంచులు మహిళా సర్పంచ్ అని చూడకుండా తనని వేధిస్తున్నారన్నారు. గ్రామానికి చెందిన కుంభరి శంకరప్ప గ్రామ పంచాయతీకి సంబంధించిన స్థలములో పశువుల నీటి దొడ్డి ఉండగా అటు నీటిలోకి భాగాన్ని తీసివేసి తన బంధువుల చేత కిరాణా డబ్బా షాప్ వేసి ఆర్టి స్థలాన్ని ఆక్రమించుకోవడం జరిగిందన్నారు. గ్రామానికి చెందిన తలారి శ్రీనివాస్ పాత స్కూల్ భాగంలో మిషన్ భగీరథ వాటర్ ట్యాంకుల దగ్గర తన యొక్క పశువులను కట్టేసి ఆ ప్రాంగణం మొత్తాన్ని అపరిశుభ్రంగా చేయడం జరుగుతుందన్నారు. గ్రామపంచాయతీ సమస్యలన్నీటికి నోటీసులు ఇవ్వమని అడిగితే గ్రామపంచాయతీ కార్యదర్శి శేఖర్, ఉపసర్పంచ్ రామప్ప, గొల్ల ఎల్లప్ప, కుమ్మరి శంకరప్ప, తలారి శ్రీనివాస్ తనపై దౌర్జన్యం చేస్తున్నారన్నారు. వారిపై శాఖా పరమైన చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నామన్నారు. ఉప సర్పంచ్ రామప్ప కు ఉన్న చెక్ పవర్ ను వెంటనే తొలగించి మరొక వార్డ్ మెంబర్ కు ఇవ్వాలని కోరుతున్నామన్నారు.