prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 28 September 2026, 10:59 am Digital Edition : PRAJA KSHETRAM

శంకర్ పల్లి ఎమ్మార్పీఎస్ కమిటీల ఎన్నిక

శంకర్ పల్లి సెప్టెంబర్ 28(ప్రజాక్షేత్రం):ఎమ్మార్పీఎస్ పునర్నిర్మాణ ప్రక్రియలో భాగంగా నూతన మండల, మున్సిపాలిటీ కమిటీలను ఎన్నుకున్నామని ఎమ్మార్పీఎస్ రంగారెడ్డి జిల్లా ఇంచార్జి రాగల్ల ఉపేందర్ మాదిగ అన్నారు. శంకర్ పల్లి లో ఆదివారం ఎమ్మార్పీఎస్ చేవెళ్ల నియోజకవర్గ ఇన్చార్జి కాడిగల్ల ప్రవీణ్ కుమార్ మాదిగ ఆధ్వర్యంలో నాయకులతో సమావేశం నిర్వహించి నూతన కమిటీని ఎంపిక చేసి ప్రకటించారు. ఈ సందర్భంగా ఉపేందర్ మాదిగ మాట్లాడుతూ ఎమ్మార్పీస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ప్రకటించే భవిష్యత్తు కార్యాచరణ అమలుకు శక్తివంతంగా మారాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మండల నూతన అధ్యక్షుడిగా లింగం సాయి కుమార్, అధికార ప్రతినిధిగా ఎన్. ప్రసాద్, ప్రధాన కార్యదర్శిగా దాసరి నాగేష్, ఉపాధ్యాక్షులుగా బడుదుల మల్లేశం, లింగం భుపాల్, కార్యదర్శిలుగా ఎన్. శ్రీధర్, నక్క మాణిక్యం మున్సిపల్ టౌన్ అధ్యక్షులుగా కటికే మోహన్, అధికార ప్రతినిధి బండ్లగూడ ప్రవీణ్, ప్రధాన కార్యదర్శి చన్నగల్ల మహేష్, ఎంఎస్పి మండల అధ్యక్షుడుగా బోడ ప్రశాంత్ మాదిగ, అధికార ప్రతినిధి మహేశ్వరం రవి, ప్రధాన కార్యదర్శిలుగా తళ్ళ రాములు, జే. శేఖర్ ను ఎన్నుకున్నారు. అక్టోబర్ 17న అమరావతిలో జరిగే ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ మండల కమిటీల జాతీయ సదస్సుకు పెద్దఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రంగారెడ్డి జిల్లా మాజీ అధ్యక్షులు పెంటనోల్ల నర్సింహా, నాని భాను ప్రసాద్ నాయకులు లక్ష్మయ్య, నర్సింలు, శంకర్, నర్సింహా, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.