- పనులు ప్రారంభించిన మండల నాయకులు, అధికారులు
కోటగిరి సెప్టెంబర్ 28(ప్రజాక్షేత్రం):కోటగిరి మండల కేంద్రంలో 90 లక్షల రూపాయలతో చేపట్టనున్న సిసి రోడ్లు డ్రైనేజీ నిర్మాణ పనులను స్థానిక నాయకులు అధికారులు సోమవారము ప్రారంభించారు. కోటగిరి మండల కేంద్రంలోని పలు కాలనీలలో చేపట్టిన సిసి రోడ్ల నిర్మాణ పనులను కోటగిరి తహసిల్దార్ గంగాధర్, ఎంపీడీవో విష్ణు లు అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీటీసీ కొట్టం మనోహర్ మాట్లాడుతూ…. కోటగిరి మండల కేంద్రంలో ఎస్సీ సబ్ ప్లాన్, ఎన్ఆర్ఈజీఎస్ నిధులు రూ.1కోటి 15 లక్షలు సిద్ధంగా ఉన్నాయని అందులో భాగంగానే నేడు 70 లక్షల ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు, 20 లక్షల ఎన్ఆర్ఈజీఎస్ నిధుల పనులు ప్రారంభించామని అన్నారు. కోటగిరి మండల కేంద్రంలో అవసరం ఉన్న కాలనీలలో పూర్తిగా సిసి రోడ్లు నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు. సీసీ రోడ్లతో పాటు పలు కాలనీలలో అవసరం ఉన్నచోట డ్రైనేజీలను సైతం నిర్మిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కోటగిరి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు షాహిద్ హుస్సేన్, కోటగిరి సొసైటీ చైర్మన్ కూచి సిద్దు, ఏఎంసి వైస్ చైర్మన్ అనిల్ కులకర్ణి, పంచాయతీరాజ్ ఏఈ నవదీష్ గౌడ్, జిపి సెక్రెటరీ సందీప్, స్థానిక నాయకులు పంది ముక్కుల సాయిలు, తదితరులు పాల్గొన్నారు.