prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 28 September 2026, 12:24 pm Digital Edition : PRAJA KSHETRAM

లింగమయ్య ఆలయ నిర్మాణం అద్భుతం..!

లింగమయ్య ఆలయ నిర్మాణం అద్భుతం..!

  • ఆలయ నిర్మాణ కర్త ముమ్మలనేని రాజశేఖర్ కృషి చరిత్రలో నిలిచిపోతుంది
  • బిఆర్ఎస్ పార్టీ బాన్సువాడ నియోజకవర్గ నాయకులు మోరిల్ శ్రీనివాసరావు
  • మోరిల్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో లింగమయ్య ఆలయంలో అన్నదానం

కోటగిరి, సెప్టెంబర్ 28(ప్రజాక్షేత్రం):నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం లింగాపూర్ గ్రామ శివారులోని లింగమయ్య ఆలయంలో బాన్సువాడ నియోజకవర్గ బీఆర్ఏస్ నాయకులు మోరిల్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సోమవారము అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా లింగమయ్య ఆలయంలో శ్రీనివాసరావు ప్రత్యేక పూజలు నిర్వహించి లింగమయ్యను దర్శించుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు భోజనం వడ్డించి స్థానిక నాయకులతో కలిసి ఆయన భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. లింగమయ్య ఆలయాన్ని ముమ్మలనేని రాజశేఖర్ తన సొంత డబ్బులు కోట్ల రూపాయల వ్యయంతో చాలా అద్భుతంగా నిర్మించారని కొనియాడారు. బాన్సువాడ నియోజకవర్గంలో కోటగిరి మండలంలో ఇంతటి గొప్ప ఆలయాన్ని నిర్మించేందుకు కృషి చేసిన ఆలయ నిర్మాణ కర్త ముమ్మలనేని రాజశేఖర్ కృషి చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఆది యోగి విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని భక్తి భావం పెంపొందేలా ప్రశాంతమైన వాతావరణం ఆలయంలో ఉందని అన్నారు. చుట్టూ కొండలు పచ్చని అడవులు అడవుల మధ్య ఆలయం నిర్మించడం గొప్ప విషయం అన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించిన శ్రీనివాసరావు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నియోజకవర్గ నాయకులు అంజిరెడ్డి, స్థానిక నాయకులు తేల్ల రవికుమార్, సూదం నవీన్, శ్రీకాంత్, సిద్దు, తదితరులు పాల్గొన్నారు.