prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 28 September 2026, 3:11 pm Digital Edition : PRAJA KSHETRAM

విధి నిర్వహణలో ఆర్మీ ఉద్యోగి మృతి

బేస్తవారిపేట, సెప్టెంబర్ 28(ప్రజాక్షేత్రం):మార్కాపురం జిల్లా బేస్తవారిపేట మండలంలోని పందిళ్లపల్లి గ్రామానికి చెందిన ఆర్మీ ఉద్యోగి కిషన్‌ అరుణాచల్‌ప్రదేశ్‌లో విధి నిర్వహణలో ఉండగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ ఘటనతో పందిళ్లపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కిషన్‌ మృతదేహాన్ని రెండు రోజుల్లో స్వగ్రామానికి తరలించేందుకు ఆర్మీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.