prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 28 September 2026, 12:30 pm Digital Edition : PRAJA KSHETRAM

రైతుల శ్రేయస్సు, సొసైటీ అభివృద్ధి కోసమే అహర్నిశలు కృషి చేశాం

రైతుల శ్రేయస్సు, సొసైటీ అభివృద్ధి కోసమే అహర్నిశలు కృషి చేశాం

  • రూ.5లక్షలు ఉన్న సొసైటీని మూడు కోట్ల మిగులు బడ్జెట్ కు తీసుకువచ్చాం
  • ధాన్యం సేకరణ సమయంలో తాత్కాలిక సిబ్బందిని పెంచి రైతులకు కోసం వెంటనే ధాన్యం డబ్బులు పడేలా చేశాం
  • కొత్తపల్లి సొసైటీ చైర్మన్ డాక్టర్ వెనిగళ్ళ సునీల్ కుమార్ కోటగిరి, సెప్టెంబర్ 28 (ప్రజాక్షేత్రం):నిజమాబాద్ జిల్లా కోటగిరి మండలం కొత్తపల్లి సొసైటీలో సోమవారం సొసైటీ చైర్మన్ డాక్టర్ వి. సునీల్ కుమార్ ఆధ్వర్యంలో 71వ మహాజనసభ నిర్వహించారు. ఈ సభలో సొసైటీ ఇన్చార్జి సెక్రెటరీ కమలేష్ సొసైటీ జమా ఖర్చుల పద్దులు చదివి వినిపించారు. అనంతరం రైతులు ఖర్చుల వివరాలపై పలు ప్రశ్నలు అడిగి సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్ డాక్టర్ సునీల్ కుమార్ మాట్లాడుతూ… సొసైటీని తమ పాలకవర్గానికి అప్పజెప్పినప్పుడు సొసైటీలో కేవలం 5 లక్షల రూపాయలు మాత్రమే ఉన్నాయని రైతుల మద్దతుతో తమ పాలకవర్గం 5 లక్షల మిగులు బడ్జెట్ ఉన్న సొసైటీని మూడు కోట్లకు తీసుకువచ్చామని చెప్పారు. సొసైటీకి ఉన్న రైస్ మిల్ కెపాసిటీని రెండు టన్నుల నుండి నాలుగు టన్నులకు పెంచినట్లు రైతులకు తెలిపారు. రైతుల కు ఎరువుల సమస్యలు లేకుండా అడిగినన్ని ఎరువులు సొసైటీ ద్వారా సరఫరా చేసినట్లు తెలిపారు. చుట్టుపక్కల ఉన్న సొసైటీల పరిధిలోని రైతులు సైతం తమ సొసైటీ వద్ద నుండి ఎరువులు తీసుకెళ్లారని గుర్తు చేశారు. ధాన్యం సేకరణ సమయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగద్దనే ఉద్దేశంతో తాత్కాలిక సిబ్బందిని పెట్టి ఎప్పటికప్పుడు రైతుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేసి వెంట వెంటనే రైతులకు అకౌంట్లో ధాన్యం డబ్బులు పడేలా కృషి చేశామని అన్నారు. రైతుల ధాన్యం వెంట వెంటనే కాటాలు నిర్వహించి ఎక్కడా రోడ్లపై ఉండకుండా వెంట వెంటనే వాహనాల ద్వారా ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించామని అన్నారు. కరోనా కష్టకాలంలో సైతం తమ సిబ్బంది ధాన్యం సేకరణ విషయంలో అద్భుతంగా పనిచేశారని పోలీసులు కొట్టినా సరే రైతుల వడ్లు కాంటాలు ఉద్దేశంతో పనిచేశారని అన్నారు. గతంలో సొసైటీలో ఉన్న డబ్బులను ఎకౌంట్లో అలాగే ఉంచేవారని కానీ ప్రస్తుతం తమ పలకవర్గం సొసైటీలో జమ ఉన్న డబ్బులను ఎఫ్డి చేసి ఆ ఎఫ్డి ద్వారా వచ్చే వడ్డీ డబ్బులు సొసైటీకి అదరపు ఆదాయంగా మారిందని అన్నారు. సొసైటీ పరిధిలోని 11 గ్రామాల రైతులు నాయకుల మద్దతుతో ఇప్పటివరకు తమ పాలకవర్గం రైతుల శ్రేయస్సు కోసం సొసైటీ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో… కొత్తపల్లి సర్పంచ్ పుప్పాల గంగారాం, దేవుని గుట్ట తాండ సర్పంచ్ కొర్ర రవి, లింగాపూర్ సర్పంచ్ దొడ్డిమీది శారద రాచప్ప పటేల్,ఎస్సార్ కాలనీ సర్పంచ్ దేగం హనుమంతు, ఎక్లాస్పూర్ సర్పంచ్ వెల్లంకి సీతా కుమారి రంగదాస్ చౌదరి,సొసైటీ డైరెక్టర్లు, సంఘ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.