prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 29 September 2026, 3:24 am Digital Edition : PRAJA KSHETRAM

కిసాన్‌ మోర్చా నాయకులకు సన్మానం

కిసాన్‌ మోర్చా నాయకులకు సన్మానం

ఆత్మకూర్ ప్రతినిధి 28(ప్రజాక్షేత్రం):ఆత్మకూరు మండల కేంద్రంలోని గెస్ట్‌హౌస్‌ వద్ద ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి రాష్ట్ర నాయకుడు లక్ష్మీకాంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకుని ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన సూచించారు. మండల స్థాయిలో ఓటరు నమోదు ప్రక్రియను విస్తృతంగా చేపట్టి ఎమ్మెల్సీ అభ్యర్థి విజయానికి కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అనంతరం నారాయణపేట జిల్లా కిసాన్‌ మోర్చా ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన విష్ణువర్ధన్‌రెడ్డి, ఆత్మకూరు మండల అధ్యక్షుడు, కన్వీనర్‌గా ఎన్నికైన మేడపల్లి మాసన్న సంజీవను మండల భాజపా అధ్యక్షుడు అశోక్‌ భూపాల్‌యాదవ్‌ ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో టౌన్‌ అధ్యక్షుడు సురేష్‌, ఆరో వార్డు కౌన్సిలర్‌ పుల్లారి భరత్‌కుమార్‌, ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్‌చార్జి మహేష్‌గౌడ్‌, మక్తల్‌ నియోజకవర్గ కో-కన్వీనర్‌ రేచింతల శ్రీనివాసులు, జిల్లా నాయకులు ఆంజనేయులు ముదిరాజ్‌, ఆనంద్‌, భగవంతురెడ్డి, పి.హరీష్‌, తిమ్మప్ప, రవి, గోపాల్‌రెడ్డి, రవికుమార్‌తో పాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.