prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 29 September 2026, 3:08 am Digital Edition : PRAJA KSHETRAM

నేడు పెద్దేముల్ సొసైటీ సర్వసభ్య సమావేశం

నేడు పెద్దేముల్ సొసైటీ సర్వసభ్య సమావేశం

  • వార్షిక లెక్కలు, ఆస్తులు–అప్పులు, బడ్జెట్‌పై చర్చ

పెద్దేముల్, సెప్టెంబర్ 29(ప్రజాక్షేత్రం)పెద్దేముల్ మండల రైతు సేవా సహకార సంఘం (సొసైటీ) సర్వసభ్య సమావేశం నేడు (మంగళవారం ) ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నారు. పెద్దేముల్ సొసైటీ చైర్మన్ ద్యావరి విష్ణువర్ధన్ రెడ్డి అధ్యక్షతన సంఘ కార్యాలయ ఆవరణలో ఈ సమావేశం జరగనుంది.ఈ సమావేశంలో 2025 ఏప్రిల్ 1 నుంచి 2026 మార్చి 31 వరకు సంఘానికి సంబంధించిన వార్షిక జమా–ఖర్చుల పట్టికను పరిశీలించి ఆమోదించనున్నారు. అలాగే 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తులు–అప్పుల పట్టికను పరిశీలించి ఆమోదించడంతో పాటు, 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అంచనా బడ్జెట్‌ను నిర్ణయించనున్నారు. అదేవిధంగా 2025–26 సంవత్సరపు ఆడిట్ నివేదికను పరిశీలించి ఆమోదించడం, సంఘానికి రావాల్సిన పాత బకాయిల వసూలుపై చర్చించడం వంటి అంశాలు సమావేశంలో ప్రధానంగా చర్చకు రానున్నాయి. అధ్యక్షుల అనుమతితో ఇతర అంశాలను కూడా సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.సంఘ సభ్యులందరూ సకాలంలో సమావేశానికి హాజరై సర్వసభ్య సమావేశాన్ని విజయవంతం చేయాలని సొసైటీ సీఈఓ జి.మురళీధర్ కోరారు.