పెద్దేముల్లో వడ్ల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి
- రైతుల రవాణా కష్టాలు,అదనపు ఖర్చులు తొలగించాలని వినతి
పెద్దేముల్, సెప్టెంబర్ 28(ప్రజాక్షేత్రం):వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం పెద్దేముల్ మండల కేంద్రంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి రైతులకు అండగా నిలవాలని పెద్దేముల్ గ్రామ సర్పంచ్ డివై. చిన్న నర్సింహులు, ఉపసర్పంచ్ డివై.ప్రసాద్, పెద్దేముల్ గ్రామ రైతులు కోరారు. వరి పంట సాగు చేసిన రైతులు తమ ధాన్యాన్ని విక్రయించేందుకు ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుండటంతో రవాణా ఖర్చులతో పాటు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు పెద్దేముల్ గ్రామ రైతులతో కలిసి రైతుల కష్టాలను తెలుసుకొని పెద్దేముల్ గ్రామ రైతుల తరఫున గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్ పెద్దేముల్ మండల ఎంపీడీఓ కే.తిరుమల స్వామికి ప్రజావాణిలో వినతిపత్రం సమర్పించి,గ్రామంలోనే వడ్ల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సందర్భంగా పెద్దేముల్ గ్రామ సర్పంచ్ డివై. నర్సింహులు, ఉపసర్పంచ్ డివై.ప్రసాద్ లతో పాటు పలువురు పెద్దేముల్ గ్రామ రైతులు మాట్లాడుతూ…వరి ధాన్యాన్ని ప్రస్తుతం విక్రయించేందుకు ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి రావడంతో రైతులు వాహనాలను సమకూర్చుకోవడం, ధాన్యాన్ని తరలించడం వంటి అంశాల్లో అదనపు వ్యయ భారాన్ని భరించాల్సి వస్తోందని రైతులు తెలిపారు.పెద్దేముల్ గ్రామంలోనే వరి కొనుగోలు కేంద్రం అందుబాటులోకి వస్తే ఈ భారాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చని పేర్కొన్నారు. పెద్దేముల్లో వడ్ల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తే పెద్దేముల్ గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల్లోని రైతులకు కూడా ప్రయోజనం చేకూరుతుందని రైతులు తెలిపారు.ధాన్యాన్ని సమీపంలోని కొనుగోలు కేంద్రానికే తరలించి విక్రయించుకునే అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు.రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని సంబంధిత అధికారులతో సమన్వయం చేసి పెద్దేముల్లో వడ్ల కొనుగోలు కేంద్రం ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని ఎంపీడీఓను స్థానిక ప్రజా ప్రతినిధులు, రైతులు కోరారు.రైతులకు సకాలంలో ధాన్యం విక్రయించే అవకాశం కల్పించి, రవాణా ఖర్చులు మరియు అనవసరమైన ఇబ్బందులు తగ్గేలా అధికారులు చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు.రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈ విషయంపై అధికారులు సానుకూలంగా స్పందించి, వీలైనంత త్వరగా కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని గ్రామ రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పెద్దేముల్ గ్రామ రైతులు, తదితరులు పాల్గొన్నారు.