6 గ్యారంటీలు 420 హామీలు అమలు చేయాలి.
తాండూరు నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ శ్రీశైలం రెడ్డి. బీఆర్ఎస్ మండల అధ్యక్షులు సి. రవీందర్ రెడ్డి. యాలాల సెప్టెంబర్ 08(ప్రజాక్షేత్రం):కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలతో పాటు ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 హామీలను అమలు చేయాలని బిఆర్ఎస్ నాయకత్వం డిమాండ్ చేశారు. యాలాల మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సి. రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమం తలపెట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తాండూర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ హాజరయ్యారు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన పిలుపు...