prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 01 September 2026, 5:17 pm Digital Edition : mohan.sabbasani@gmail.com

స్టడీ హాళ్లలో ల్యాప్‌టాప్‌ల చోరీ

కుషాయిగూడ, సెప్టెంబరు 1(ప్రజా క్షేత్రం): స్టడీ హాళ్లలో ల్యాప్‌టాప్‌లు చోరీకి గురైన ఘటనలు కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకున్నాయి. నార్త్‌ కమలా నగర్‌లోని అంబిషన్‌ స్టడీ హాల్‌లో ఈ నెల 16న ఎరగంటి వంశీకి చెందిన ల్యాప్‌టాప్‌, సౌత్‌ కమలా నగర్‌లోని క్యాబిన్‌మేట్‌ స్టడీ హాల్‌లో 24న కుడికాల మోహన్‌కృష్ణకు చెందిన ల్యాప్‌టాప్‌ను గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు. సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలించగా.. క్యాబిన్‌ల వద్దకు వచ్చిన వ్యక్తులు ల్యాప్‌టాప్‌లను తీసుకెళ్లినట్లు గుర్తించారు. రెండు ఘటనలపై కేసులు నమోదు చేసిన పోలీసులు సాంకేతిక ఆధారాలతో నిందితుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు. చోరీకి గురైన ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకునేందుకు దర్యాప్తు కొనసాగుతోంది. విద్యార్థులు, స్టడీ హాళ్ల నిర్వాహకులు విలువైన వస్తువుల భద్రతపై అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.