కాలువలోకి దూసుకెళ్లిన ప్రైవేటు పాఠశాల బస్సు
కాలువలోకి దూసుకెళ్లిన ప్రైవేటు పాఠశాల బస్సు విద్యార్థులు లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం.. భద్రతపై అధికారుల దృష్టి సారించాలని స్థానికుల డిమాండ్ శంకర్ పల్లి సెప్టెంబర్ 03(ప్రజాక్షేత్రం):టంగుటూరు–మోకిలా ప్రధాన రహదారిపై ప్రైవేటు పాఠశాల బస్సు అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది. బస్సు ఒకవైపు ఒరిగిపోయి మట్టిలో ఇరుక్కుపోయింది. ప్రమాద సమయంలో బస్సులో విద్యార్థులు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. దీంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. రహదారిపై వెళ్తున్న సమయంలో బస్సు అదుపుతప్పడంతో పక్కకు దూసుకెళ్లినట్లు తెలుస్తోంది. కాలువలోకి వెళ్లిన బస్సు మట్టిలో ఇరుక్కుపోవడంతో అక్కడే...