పర్యావరణహిత మట్టి వినాయకుల పంపిణీ నాగారం, సెప్టెంబరు 13(ప్రజా క్షేత్రం): వినాయక చవితి సందర్భంగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. నాగారం డివిజన్‌–5లోని సాయి ధరణి నగర్‌ కాలనీ ఫేజ్‌–2లో శనివారం కాలనీ కమ్యూనిటీ హాల్‌ వద్ద ఈ కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి సహకారంతో సుమారు 100 మట్టి వినాయక విగ్రహాలను కాలనీ వాసులకు అందజేశారు. కాలుష్య నియంత్రణ మండలి ఈఈ రాజేందర్‌ విగ్రహాలను అందించారు. మట్టి విగ్రహాలను వినియోగించి పర్యావరణాన్ని కాపాడాలని నిర్వాహకులు...