prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 01 October 2026, 9:25 am Digital Edition : PRAJA KSHETRAM

దిక్కు లేక బావిలో దూకి వృద్ధ దంపతుల ఆత్మహత్య

  • 25 ఎకరాలు తీసుకుని తల్లిదండ్రులను రోడ్డున పడేసిన ముగ్గురు కొడుకులు!
  • వంట చేసే సత్తువ లేక ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిని గడిపిన వైనం
  • బతుకు దెరువు కోసం రెండెకరాలు ఇప్పించాలని కోరినా ఎవరూ పట్టించుకోని వైనం

సంగారెడ్డి అక్టోబర్ 01(ప్రజాక్షేత్రం):సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం చాప్తా.కె గ్రామంలో తమకున్న 25 ఎకరాల భూమిని, ఇంటిని తమ ముగ్గురు కొడుకులు సిద్ధారెడ్డి, కృష్ణారెడ్డి, సంగారెడ్డిలకు పంచిన ముంగే నర్సారెడ్డి(88), అంజమ్మ(85) అనే వృద్ధ దంపతులు భూ పంపకాలు జరిగిన రోజు నుండి తల్లిదండ్రులను కొడుకులు గాలికి వదిలేశారని, అంజమ్మ ఆరోగ్యం బాగాలేక వంట చేసుకునే పరిస్థితి లేక కొన్ని రోజులు ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిని గడిపారని తెలిపిన గ్రామస్తులు రెండుమూడేళ్లుగా తమ కొడుకులు పట్టించుకోవడం లేదని, పంచిన భూమిలో ఒకటి, రెండెకరాలు తమకు తిరిగి ఇప్పించాలని పోలీసులను, అధికారులను వేడుకున్నా పట్టించుకోని వైనం దీంతో తినడానికి తిండి కూడా లేదని మనస్తాపంతో వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న వృద్ధ దంపతులు మృతుల మనవడు తిరుపతిరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు