దిక్కు లేక బావిలో దూకి వృద్ధ దంపతుల ఆత్మహత్య
25 ఎకరాలు తీసుకుని తల్లిదండ్రులను రోడ్డున పడేసిన ముగ్గురు కొడుకులు! వంట చేసే సత్తువ లేక ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిని గడిపిన వైనం బతుకు దెరువు కోసం రెండెకరాలు ఇప్పించాలని కోరినా ఎవరూ పట్టించుకోని వైనం సంగారెడ్డి అక్టోబర్ 01(ప్రజాక్షేత్రం):సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం చాప్తా.కె గ్రామంలో తమకున్న 25 ఎకరాల భూమిని, ఇంటిని తమ ముగ్గురు కొడుకులు సిద్ధారెడ్డి, కృష్ణారెడ్డి, సంగారెడ్డిలకు పంచిన ముంగే నర్సారెడ్డి(88), అంజమ్మ(85) అనే వృద్ధ దంపతులు భూ పంపకాలు జరిగిన రోజు నుండి తల్లిదండ్రులను...