prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 03 October 2026, 5:52 am Digital Edition : PRAJA KSHETRAM

గాంధీజీ ఆశయాలే అభివృద్ధికి బాటలు

గాంధీజీ ఆశయాలే అభివృద్ధికి బాటలు

  • గాంధీజీ సిద్ధాంతాలే కాంగ్రెస్ పార్టీకి మూలాధారం
  • గాంధీజీ సూచించిన మార్గంలో ప్రతి ఒక్కరు నడవాలి
  • కోటగిరి మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షాహిద్ హుస్సేన్
  • కోటగిరిలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

కోటగిరి, అక్టోబరు 02(ప్రజాక్షేత్రం):మహాత్మా గాంధీ కలలుగన్న సమసమాజ స్థాపనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోటగిరి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు షాహిద్ హుస్సేన్ పిలుపునిచ్చారు.
సత్యం, అహింస, సేవా మార్గాలను అనుసరిస్తూ సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు. మహాత్మా గాంధీ
జయంతి సందర్భంగా శుక్రవారం కోటగిరి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు నివాళులు అర్పించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు షాహిద్ హుస్సేన్ మాట్లాడుతూ…. గాంధీజీ ఆశయాలే తెలంగాణ అభివృద్ధికి బాటలు అవుతున్నాయని అన్నారు. గాంధీజీ సూచించిన సత్యం అహింస మార్గంలో ప్రతి ఒక్కరు నడవాలని సమాసమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని కోరారు. అహింస సత్యంతో సమాజంలో సోదర భావం పెరుగుతుందని ఆయన తెలిపారు. గాంధీజీ సిద్ధాంతాలని అనుసరిస్తూ కాంగ్రెస్ పార్టీ నేటికీ ముందుకు సాగుతుందని చెప్పారు. అందుకే తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రజాధరణ పొందిన పార్టీగా కాంగ్రెస్ అవర్థికరించిందని అన్నారు.

గాంధీజీకి ఘన నివాళి

కోటగిరి మండల కేంద్రంలోని గాంధీ విగ్రహం వద్ద కోటగిరి మండలం సర్పంచుల ఫోరం అధ్యక్షుడు బర్ల మధుకర్.. ఆధ్వర్యంలో కోటగిరి గ్రామపంచాయతీ సిబ్బంది గాంధీజీకి ఘన నివాళులు అర్పించారు. అనంతరం గ్రామపంచాయతీ ఆవరణలోని గాంధీ విగ్రహానికి సైతం నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ బర్ల మధుకర్ మాట్లాడుతూ.. గాంధీజీ కలలుగన్న భారతదేశం అంటే కేవలం స్వాతంత్ర్యం సాధించిన దేశం మాత్రమే కాదన్నారు. ప్రతి పౌరుడికి సమాన హక్కులు, సామాజిక న్యాయం, పేదరిక నిర్మూలన, స్వచ్ఛత, గ్రామీణాభివృద్ధి, శాంతి, సౌభ్రాతృత్వం పరిఢవిల్లే దేశమని పేర్కొన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం మహాత్ముడు చేసిన త్యాగాలను స్మరించుకోవడంతోపాటు ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టడమే నిజమైన నివాళి అని అన్నారు. గాంధీజీ కలలు కన్న స్వచ్ఛభారత్ కోసం ప్రతిపౌరుడు పాటుపడాలని కోరారు. గ్రామీణ స్థాయి నుండే పౌరులు స్వచ్ఛభారత్ మిషన్ లో భాగం అవ్వాలని ప్రతి పౌరుడు తన ఇంటి తో పాటు ఇంటి చుట్టూ ఆవరణను తమ కాలనీని తమ గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడే గాంధీజీ కలలు కన్న స్వచ్ఛభారత్ సాధ్యమవుతుందన్నారు. గాంధీజీ సూచించిన విధంగా ప్రకృతి వనరులను మనం వినియోగించుకోవడంతోపాటు మన భవిష్యత్తు తరాల కోసం కాపాడాలని కోరారు. నీటి వినియోగంలో ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉంటూ భవిష్యత్తు తరాల కోసం నీటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు షాహిద్ హుస్సేన్, సర్పంచ్ బర్ల మధుకర్, సొసైటీ చైర్మన్ కూచి సిద్దు, మాజీ సర్పంచ్ పత్తి లక్ష్మణ్, ఎంపీపీ గంగాధర్ దేశాయ్, మాజీ ఎంపీటీసీలు కొట్టం మనోహర్, సలీం, మండల కిసాన్ ఖేత్ అధ్యక్షుడు ఆనంద్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కొల్లూరు రమేష్ బాబు, ఆనంద్, హైమద్, దత్తు, అఫ్జల్ హుస్సేన్, షకీల్, అబ్బయ్య, కప్ప గణేష్, మోతిపేట రాజయ్య,తదితరులు పాల్గొన్నారు.