గాంధీ విగ్రహం ఏర్పాటు చేసిన ఎస్.జితేందర్ రెడ్డికి ఘన సన్మానం
పెద్దేముల్, అక్టోబర్ 02(ప్రజాక్షేత్రం):పెద్దేముల్ మండల కేంద్రంలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని సొంత ఖర్చులతో ఏర్పాటు చేసి, గాంధీజీ జయంతి, వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించుకునేలా వెసులుబాటు కల్పించిన తాండూరు మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్, పెద్దేముల్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎస్.జితేందర్ రెడ్డిని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పి.మహిపాల్ రెడ్డి,మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. శుక్రవారం గాంధీజీ జయంతి సందర్భంగా జితేందర్ రెడ్డికి శాలువాలు కప్పి, పూలమాలలతో సత్కరించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పి.మహిపాల్ రెడ్డితో పాటు పలువురు మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాట్లాడుతూ.. మహాత్మా గాంధీజీ పట్ల గౌరవంతో సొంత ఖర్చులతో విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. గాంధీజీ ఆశయాలను భవిష్యత్ తరాలకు పరిచయం చేసేలా విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ఎస్.జితేందర్ రెడ్డి సామాజిక బాధ్యతను చాటుకున్నారని పేర్కొన్నారు. గాంధీజీ జయంతి, వర్ధంతి వేడుకలను ప్రతి ఏడాది ఇక్కడ ఘనంగా నిర్వహించుకునే అవకాశం కల్పించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షురాలు కే.శోభారాణి,తట్టేపల్లి పీఏసీఎస్ ఛైర్మెన్ పి.మహిపాల్ రెడ్డి వైస్ చైర్మన్ బండమీదిపల్లి జగన్,మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు నారాయణగౌడ్, కోట్పల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బుజ్జమ్మ, మాజీ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు ఎన్.ఎల్లారెడ్డి, మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ పెండ్యాల ప్రవీణ్ కుమార్ గుప్తా,మండల కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ తట్టేపల్లి కే.నర్సింహులు,మాజీ సర్పంచ్ శ్రావణ్,పెద్దేముల్ కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు కుమ్మరి సాయిలు, మంబాపూర్ గ్రామ కమిటీ అధ్యక్షుడు పీటర్ యాదయ్య,రుక్మాపూర్ గ్రామ కమిటీ అధ్యక్షుడు సురేందర్, ఓమ్లానాయక్ తండా గ్రామ కమిటీ అధ్యక్షుడు మనోజ్ చౌహాన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డివై.నర్సింహులు, సయ్యద్ షబ్బీర్, కుర్వ బాలు, చెట్లమీది రామప్ప, ఆనందం చారి,మైఫూజ్, హర్షవర్ధన్ రెడ్డి, మినాజ్, ఇక్బాల్, ముజీబ్, నర్సింహారెడ్డి,ఫయాజ్,రాజు, దత్తు తదితరులు, గ్రామస్తులు పాల్గొన్నారు.