రహదారికి మరమ్మతులు చేసిన ఎమ్మార్పీఎస్ నాయకులు
రహదారికి మరమ్మతులు చేసిన ఎమ్మార్పీఎస్ నాయకులు అధికారంలో లేకున్నా ప్రజాసేవలో ముందడుగు శంకర్ పల్లి అక్టోబర్ 10(ప్రజాక్షేత్రం):వికారాబాద్–శంకర్పల్లి ప్రధాన రహదారిపై మహాలింగాపురం సమీపంలో ప్రమాదకరంగా మారిన రోడ్డు భాగానికి ఎమ్మార్పీఎస్ నాయకులు గుట్టకింది రవికుమార్ మాదిగ, చిట్టిగిద్ద కిష్టయ్య మాదిగ మరమ్మతులు చేసారు. రహదారి దెబ్బతినడంతో వాహనదారులు ప్రమాదాల బారిన పడే అవకాశం ఉండటాన్ని గుర్తించిన ఉద్యమ నాయకులు స్పందించి మరమ్మతులు చేపట్టారు. ప్రజాప్రతినిధులు పరిష్కరించాల్సిన సమస్యను, ఎలాంటి అధికార పదవులు లేకున్నా ఎమ్మార్పీఎస్ నాయకులు ముందుకొచ్చి పరిష్కరించే ప్రయత్నం చేయడం స్థానికంగా చర్చనీయాంశమైంది....