prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 15 October 2026, 5:36 pm Digital Edition : PRAJA KSHETRAM

శివశంకర్ మాదిగకు మంద కృష్ణ మాదిగ కన్నీటి నివాళి

శివశంకర్ మాదిగకు మంద కృష్ణ మాదిగ కన్నీటి నివాళి

  • శివశంకర్ మాదిగ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు
  • కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి
  • ఎమ్మార్పీఎస్ ఉద్యమానికి తీరని లోటు
  • పద్మశ్రీ మందకృష్ణ మాదిగ

శంకర్‌పల్లి, అక్టోబర్ 15(ప్రజాక్షేత్రం):ఎమ్మార్పీఎస్ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి బ్యాతల శివశంకర్ మాదిగ ఆకస్మిక మృతి ఉద్యమానికి తీరని లోటని ఎమ్మార్పీఎస్ అధినేత, పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ అన్నారు. ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన శివశంకర్ మాదిగ కుటుంబాన్ని స్థానిక నాయకులతో కలిసి గురువారం ఆయన పరామర్శించారు. రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం టంగటూరు గ్రామంలోని శివశంకర్ మాదిగ నివాసానికి వెళ్లిన మందకృష్ణ మాదిగ, ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించి, వారి దుఃఖంలో పాలుపంచుకున్నారు. శివశంకర్ మాదిగ మరణానికి సంబంధించిన వివరాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. శివశంకర్ మాదిగ తల్లిదండ్రులు, భార్య, పిల్లలను మందకృష్ణ మాదిగ ఓదార్చారు. ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని సూచిస్తూ, వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబానికి అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఆప్తుడిని కోల్పోయిన కుటుంబానికి మనోధైర్యం కల్పిస్తూ, వారి కష్టసుఖాల్లో తోడుగా ఉంటామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పద్మశ్రీ మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ…
ఎమ్మార్పీఎస్ ఉద్యమంలో శివశంకర్ మాదిగ క్రియాశీలకంగా పనిచేశారని, ఉద్యమం పట్ల నిబద్ధతతో వ్యవహరించిన వ్యక్తిగా గుర్తింపు పొందారని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆయన అకాల మరణం చేవెళ్ల ప్రాంతంలో ఎమ్మార్పీఎస్ ఉద్యమానికి తీరని లోటని అన్నారు. ఉద్యమంలో ఆయన అందించిన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రంగారెడ్డి జిల్లా ఇంచార్జి రాగల్ల ఉపేందర్ మాదిగ, ఎంఎస్‌పీ జిల్లా మాజీ అధ్యక్షుడు రావుగళ్ల బాబు మాదిగ, ఎమ్మార్పీఎస్ మాజీ జిల్లా అధ్యక్షుడు పెంటనోళ్ల నర్సింహా మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు కాడిగాళ్ల ప్రవీణ్ కుమార్ మాదిగ, శంకర్‌పల్లి మండల అధ్యక్షుడు లింగం సాయి మాదిగ, ప్రధాన కార్యదర్శి దాసరి నాగేష్, చేవెళ్ల మండల అధ్యక్షుడు మల్లేష్ మాదిగ, మొయినాబాద్ మండల అధ్యక్షుడు కుమార్ మాదిగ, షాబాద్ మండల అధ్యక్షుడు ముల్కి ప్రవీణ్ మాదిగ, ఎంఎస్పి మండల అధ్యక్షులు బోడ ప్రశాంత్ మాదిగ, శంకర్ పల్లి మున్సిపల్ అధ్యక్షులు కటికే మోహన్ మాదిగ తదితరులు పాల్గొన్నారు. ఎంఎస్‌పీ మండల అధ్యక్షుడు కూడా పాల్గొన్నారు.