బ్యాతల శివశంకర్ కుటుంబనికి దాసరి నాగేష్ రూ.50 వేల ఆర్థిక సాయం
- మంద కృష్ణ మాదిగ చేతుల మీదుగా ఆర్థిక సహాయం అందజేత
- సేవా కార్యక్రమంలో ముందడుగు వేసిన దాసరి నాగేష్
- నాగేష్‌ను అభినందించిన మంద కృష్ణ మాదిగ.
శంకర్ పల్లి, అక్టోబర్ 16(ప్రజాక్షేత్రం):సామాజిక సేవలో భాగంగా ఎమ్మార్పీఎస్ నాయకులు మరోసారి తమ ఉదారతను చాటుకున్నారు. బ్యాతల శివశంకర్ మాదిగ కుటుంబానికి రూ.50 వేల ఆర్థిక సహాయాన్ని అందజేసి అండగా నిలిచారు. ఎమ్మార్పీఎస్ మండల ఉపాధ్యక్షులు దాసరి నాగేష్ ఆధ్వర్యంలో ఈ ఆర్థిక సహాయాన్ని పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ చేతుల మీదుగా అందజేశారు. మోకిల గ్రామానికి చెందిన నాగేష్ ఇంటికి వెళ్లి మందకృష్ణ మాదిగ అభినందించారు. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న వారికి సహాయం చేయాలనే సంకల్పంతో దాసరి నాగేష్ ముందుకు వచ్చి రూ.50 వేల ఆర్థిక సాయం అందించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. సమాజంలో ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడం, అవసరమైన సమయంలో ఆర్థిక తోడ్పాటు అందించడం అభినందనీయమని నాయకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు కాడిగల్ల ప్రవీణ్ కుమార్, మండల అధ్యక్షుడు లింగం సాయి మాదిగ, శంకర్పల్లి మున్సిపల్ అధ్యక్షుడు కటికే మోహన్, బండ్లగూడెం శ్రీనివాస్ తదితరులు దాసరి నాగేష్‌ను అభినందించారు. సామాజిక బాధ్యతతో ముందుకు వచ్చి బాధితుడికి ఆర్థిక సహాయం అందించడం ఇతరులకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. సమాజంలోని అణగారిన వర్గాలకు అండగా నిలుస్తూ, ఆపదలో ఉన్నవారికి తోడ్పాటు అందించే కార్యక్రమాలు మరింత విస్తరించాలని ఈ సందర్భంగా నాయకులు ఆకాంక్షించారు. బాధితులకు సహాయం చేయడంలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు.
