prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 20 October 2026, 6:06 pm Digital Edition : PRAJA KSHETRAM

చీకటిమయంగా శంకర్‌పల్లి–చేవెళ్ల రహదారి

చీకటిమయంగా శంకర్‌పల్లి–చేవెళ్ల రహదారి

  • వాహనదారులు, ప్రజలకు తప్పని ఇబ్బందులు.
  • వీధి దీపాలు ఏర్పాటు చేయాలని స్థానికుల విజ్ఞప్తి.

శంకర్‌పల్లి, అక్టోబర్ 20(ప్రజాక్షేత్రం):శంకర్‌పల్లి ప్రధాన చౌరస్తా నుంచి చేవెళ్ల వైపు వెళ్లే రహదారి రాత్రి వేళల్లో చీకటిమయంగా మారడంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారిపై సరైన వెలుతురు లేకపోవడంతో రాత్రి సమయంలో ప్రయాణించే వాహనదారులు అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు, పాదచారులు చీకటిలో రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధాన రహదారిపై వీధి దీపాలు లేకపోవడం లేదా వెలగకపోవడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళల్లో వాహనాలు ఎదురెదురుగా వచ్చినప్పుడు రహదారి స్పష్టంగా కనిపించకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొంటున్నారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని సంబంధిత అధికారులు తక్షణమే స్పందించాలని కోరుతున్నారు.