ఆమ్మో..మల్లారెడ్డి..మా.. మా!?
- 1986లో సింగపూర్‌లో..కహాని..!?
- మన మల్లారెడ్డి దగ్గర…రివాల్వర్ ఉందట!?
- మాజీ మంత్రి మల్లారెడ్డి కామెంట్స్ వైరల్!?
- దసరా వేళ ఆయుధపూజలో ఆసక్తికర వ్యాఖ్యలు!?
- సింగపూర్‌లో రూ.3 వేలకే కొనుగోలు చేశానన్న మల్లారెడ్డి!
- ఆత్మరక్షణ కోసమే.. 40 ఏళ్లుగా తన వద్దే ఉందని వెల్లడి!?
హైదరాబాద్ అక్టోబర్ 21(ప్రజాక్షేత్రం):దసరా పర్వదినం సందర్భంగా మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. విజయదశమి సందర్భంగా బోయినపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఆయుధపూజ కార్యక్రమంలో రివాల్వర్‌ను చూపిస్తూ ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
రూ.3 వేలకే కొనుగోలు.. చేసారంట!… ఏడికొంచి..!?
తన వద్ద ఉన్న రివాల్వర్‌ను 1986లో సింగపూర్‌లో రూ.3 వేలకే కొనుగోలు చేశానని మల్లారెడ్డి తెలిపారు. అప్పట్లోనే దీనికి ఆల్ ఇండియా లైసెన్స్ పర్మిషన్ తీసుకున్నట్లు పేర్కొన్నారు. సుమారు 40 ఏళ్లుగా ఆ రివాల్వర్ తన వద్దే ఉందని చెప్పారు.
ఆత్మరక్షణ కోసమేనని వెల్లడి!
రివాల్వర్‌ను తాను కేవలం ఆత్మరక్షణ కోసం మాత్రమే దగ్గర ఉంచుకున్నానని మల్లారెడ్డి స్పష్టం చేసినట్లు వార్తా కథనాలు పేర్కొంటున్నాయి. దసరా సందర్భంగా ఆయుధపూజలో భాగంగా రివాల్వర్‌ను చూపించడం, దాని పాత జ్ఞాపకాలను వెల్లడించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
దసరా వేళ.. పాత జ్ఞాపకాలు వైరల్!
ప్రతి ఏటా విజయదశమి సందర్భంగా ఆయుధపూజ నిర్వహించే సంప్రదాయంలో భాగంగా ఈ కార్యక్రమం జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఈసారి మల్లారెడ్డి చెప్పిన “1986 నుంచే నా దగ్గర రివాల్వర్ ఉంది” అనే వ్యాఖ్యే సోషల్ మీడియాలో ప్రధాన చర్చగా మారింది.
మొత్తంగా.. దసరా ఆయుధపూజలో మల్లారెడ్డి రివాల్వర్ ప్రస్తావన రాజకీయ వర్గాల్లోనే కాకుండా సోషల్ మీడియాలోనూ ఆసక్తిని రేపుతోంది.