నా ఊరి అభివృద్ధికై నేను సైతం
- మల్లారెడ్డిగూడెం గ్రామ ప్రజలు.
సంస్ధాన్ నారాయణపురం, అక్టోబర్ 21(ప్రజాక్షేత్రం):యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం మల్లారెడ్డి గ్రామ పంచాయతీలోని ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగంలో స్థిరపడిన గ్రామ యువకులు మరియు ప్రజలు తమ ఊరి అభివృద్ధి కోసం నేను సైతం అంటూ ముందుకు వచ్చారు. ఈ యొక్క కార్యక్రమం గ్రామ సర్పంచ్ అన్నం మల్లేష్ ఆధ్వర్యంలో గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో అందరూ కలిసి సమావేశమై తమ ఊరి అభివృద్ధి కోసం తమ వంతు సహాయ సహకారాలను అందిస్తామని గ్రామ ప్రజల ముందు వాగ్దానం ఇచ్చారు. ఈ సందర్భంగా మనూరు మాట్లాడుతూ ఇప్పుటి వరకు మన గ్రామం అభివృద్ధిలో వెనుకబడి ఉన్నది. మన పెద్దవాళ్లు ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు. ఐనా తమ పిల్లలకు ఉన్నత చదువులు చదివించి ఒక స్థాయిలో నిలబెట్టారని ఈ సందర్భంగా పలువురు చెప్పుకొచ్చారు. తమ పెద్దలు నిరక్షరాస్యులు ఐనా కానీ సంఘంలో గౌరవంగా బతకడం నేర్పారన్నారు. తమ ఊరిలో కొందరు లెక్చరర్స్, సాఫ్ట్వేర్లు, డాక్టర్లు, న్యాయవాదులు, సొంత వ్యాపారస్తులు, రాజకీయ నాయకులుగా జీవితంలో స్థిరపడినాము అని అన్నారు. కావున ఎంత ఎదిగినా ఉన్న ఊరిని – కన్నవారిని మర్చిపోకూడదనే నానుడిని నిజం చేస్తూ తమవంతుగా తమ ఊరి అభివృద్ధి కోసం ఆర్థికంగా సహకరిస్తామని గ్రామ సర్పంచ్ కు మాట ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అన్నం మల్లేష్, నర్రి నరసింహ, ఆర్గనైజర్స్ నర్రి వెంకన్న, రామలింగం, పందుల రాజు, చిరగోని పరమేష్, నర్రి లింగం, సుగ్రీవ, వీరమల్ల కృష్ణ, నర్రి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.