- మర్యాదపూర్వకంగా కలిసి దసరా శుభాకాంక్షలు కాడిగల్ల ప్రవీణ్ కుమార్ నేతలు
శంకర్ పల్లి అక్టోబర్ 21(ప్రజాక్షేత్రం):రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం శంకర్ పల్లి మండలానికి చెందిన ఎమ్మార్పీఎస్ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు కాడిగల్ల ప్రవీణ్ కుమార్, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు లింగం సాయి మాదిగ, మండల ఉపాధ్యక్షులు దాసరి నాగేష్ మాదిగ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ‘పద్మశ్రీ’ మంద కృష్ణ మాదిగను హైదరాబాద్ వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి బొకే శాలువతో సన్మానించి విజయదశమి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంద కృష్ణ మాదిగ మాట్లాడుతూ విజయదశమి పర్వదినం ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, విజయాలు నింపాలని ఆకాంక్షించారు. ప్రతి కుటుంబం ఆనందంగా, సుఖశాంతులతో జీవించాలని కోరుకున్నారు.