prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 23 October 2026, 10:40 am Digital Edition : PRAJA KSHETRAM

దళితుడిపై దాడిని తీవ్రంగా ఖండించిన ఎమ్మార్పీఎస్

దళితుడిపై దాడిని తీవ్రంగా ఖండించిన ఎమ్మార్పీఎస్

  • దాడికి గురైన భాస్కర్‌ను పరామర్శించిన ఎమ్మార్పీఎస్ బృందం.
  • నిందితులను వెంటనే అరెస్టు చేయాలి — లేనిపక్షంలో ఆందోళన తప్పదు!
  • ఎమ్మార్పీఎస్ రంగారెడ్డి జిల్లా మాజీ అధ్యక్షులు పెంటనోల్ల నర్సింహా మాదిగ.

చేవెళ్ల అక్టోబర్ 23(ప్రజాక్షేత్రం):దళితుడైన భాస్కర్‌పై జరిగిన దాడిని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) తీవ్రంగా ఖండించింది. దాడికి గురైన భాస్కర్‌ను ఎమ్మార్పీఎస్ బృందం పరామర్శించి, ఆయనకు అండగా ఉంటామని భరోసా కల్పించింది. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ నాయకులు మాట్లాడుతూ, దళితులపై దాడులకు పాల్పడే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భాస్కర్‌పై దాడి చేసిన నిందితులను పోలీసులు వెంటనే అరెస్టు చేసి, బాధితుడికి న్యాయం చేయాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును నిర్వీర్యం చేసేందుకు కౌంటర్ కేసులు పెట్టే ప్రయత్నాలను సహించేది లేదు. బాధితుడిని భయభ్రాంతులకు గురిచేయడం, కేసు దర్యాప్తును ప్రభావితం చేయడం వంటి చర్యలకు పాల్పడితే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారులను డిమాండ్ చేశారు. కౌంటర్ కేసు తప్పుడు ఉద్దేశంతో పెట్టినట్లు తేలితే, బాధ్యులపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. దళితులపై దాడులు జరిగినప్పుడు బాధితులకు అండగా నిలబడటం, వారికి న్యాయం జరిగే వరకు పోరాటం చేయడం ఎమ్మార్పీఎస్ బాధ్యత అని నాయకులు పేర్కొన్నారు. దళితులపై దాడులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు. భాస్కర్‌పై దాడి చేసిన నిందితులను తక్షణమే అరెస్టు చేయాలి. లేనిపక్షంలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. బాధితుడికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పెంటన్నోల్ల నరసింహ మాదిగ, ఎంఎస్పి మాజీ జిల్లా అధ్యక్షులు రావుగల్ల బాబు మాదిగ, ఎమ్మార్పీఎస్ రంగారెడ్డి జిల్లా మాజీ ఉపాధ్యక్షులు కాడిగల్ల ప్రవీణ్ కుమార్ మాదిగ, ఊరెంట ప్రవీణ్, మండల అధ్యక్షులు కొండాపూర్ మల్లేష్, శంకర్ పల్లి మండల అధ్యక్షులు లింగం సాయి, మొయినాబాద్ మండల అధ్యక్షులు రామగల్ల కుమార్, షాబాద్ మండల అధ్యక్షులు మల్కి ప్రవీణ్, మాజీ మండల అధ్యక్షులు కొడిగారి మహేందర్, రవి, ఈదులపల్లి రాములు మాదిగ, మల్లికార్జున్, వెంకటేష్, కృష్ణ, రాజేందర్, విజయ్, కుమార్, చింటూ, వినోద్, శేఖర్, తదితరులు పాల్గొన్నారు.