సంగారెడ్డి ఫ్యాక్టరీలో విషాదం.. గ్యాస్ లీకై ఇద్దరి మృతి
సంగారెడ్డి ఫ్యాక్టరీలో విషాదం.. గ్యాస్ లీకై ఇద్దరి మృతి సంగారెడ్డి జిల్లా సరాకా పరిశ్రమలో గ్యాస్ లీక్ మృతులు సుదర్శన్, బాలాజీగా గుర్తింపు యాజమాన్య నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ఆరోపణలు ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సంగారెడ్డి అక్టోబర్ 23(ప్రజాక్షేత్రం):తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామికవాడలోని ‘సరాకా’ పరిశ్రమలో గ్యాస్ లీకై ఇద్దరు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మృతులను సుదర్శన్, బాలాజీగా గుర్తించారు. గ్యాస్ లీకేజీ కారణంగా ఊపిరాడకపోవడంతోనే వారు మృతి చెందినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు....