prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 24 October 2026, 5:50 pm Digital Edition : PRAJA KSHETRAM

పేదలకు ఉచితంగా మెగా వైద్య శిబిరం

పేదలకు ఉచితంగా మెగా వైద్య శిబిరం

  • పొద్దుటూరులో ఆదివారం నిర్వహణ.. పలు రకాల వైద్య పరీక్షలు ఉచితం.

శంకర్ పల్లి అక్టోబర్ 24(ప్రజాక్షేత్రం):పేదలకు నాణ్యమైన వైద్య సేవలను అందించాలనే లక్ష్యంతో రోటరీ క్లబ్ ఆఫ్ కోకాపేట్ ఏకం ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నారు. ప్రొద్దుటూరు గ్రామ సర్పంచ్ బండ లక్ష్మి నర్సింహా గ్రామస్తులకు వైద్య సేవలను చేరువ చేయాలనే ఉద్దేశంతో సూరకంటి రామిరెడ్డి, సురకంటి శశికాంత్ రెడ్డి గార్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ నెల 25వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు పాడుటూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (జడ్.పి.హెచ్.ఎస్)లో వైద్య శిబిరం ప్రారంభం కానుంది. ఈ శిబిరంలో భాగంగా పలు రకాల వైద్య పరీక్షలను ఉచితంగా నిర్వహించనున్నారు. మహిళల ఆరోగ్యానికి సంబంధించి పాప్ స్మియర్ పరీక్ష, సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్, మామోగ్రఫీ వంటి పరీక్షలతో పాటు అల్ట్రాసౌండ్, పొత్తికడుపు, పెల్విస్ సంబంధిత పరీక్షలు, డిజిటల్ ఎక్స్‌రే ఛాతీ పరీక్షలు అందుబాటులో ఉంటాయి. అలాగే అవసరమైన వారికి ఇతర వైద్య పరీక్షలు నిర్వహించి ఆరోగ్య సమస్యలను గుర్తించేందుకు వైద్య బృందం సేవలందించనుంది. శిబిరంలో సాధారణ ఆరోగ్య పరీక్షలు, రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయుల పరీక్షలు, కంటి పరీక్షలు, దంత పరీక్షలు, ఈసీజీ తదితర సేవలు కూడా అందించనున్నారు. ఎముకలు, కీళ్లు, చర్మం, గుండె సంబంధిత సమస్యలపై వైద్యుల సలహాలు పొందే అవకాశం కల్పిస్తున్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలు ఈ ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు. ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడంతో పాటు ముందస్తు పరీక్షల ద్వారా వ్యాధులను గుర్తించడం ఈ శిబిరం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. సర్పంచ్ బండ లక్ష్మి నర్సింహా తెలిపారు ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ప్రతినిధులు, వైద్య సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు.