prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 25 October 2026, 4:00 pm Digital Edition : PRAJA KSHETRAM

ఫామ్‌హౌస్‌లలో అక్రమ మద్యం కలకలం

ఫామ్‌హౌస్‌లలో అక్రమ మద్యం కలకలం

  • 26 లీటర్ల మద్యం, నాలుగు హుక్కా పాట్స్‌ స్వాధీనం.

మొయినాబాద్, అక్టోబర్ 25(ప్రజాక్షేత్రం):ఫామ్‌హౌస్‌లలో అక్రమ కార్యకలాపాలపై పోలీసులు కొరడా ఝళిపించారు. మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తోలుకట్ట, సురంగల్ గ్రామాల్లో పలు ఫామ్‌హౌస్‌లపై శనివారం రాత్రి నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో 26 లీటర్ల అక్రమ మద్యం, నాలుగు హుక్కా పాట్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలకు సంబంధించి ఫామ్‌హౌస్‌ల యజమానులు, పార్టీ నిర్వాహకులపై కేసులు నమోదు చేసి తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టారు. చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్, ఏసీపీ కిషన్, మొయినాబాద్ ఎస్‌హెచ్‌ఓ వై. మల్లికార్జున్ రెడ్డి, డీఐ ఉపేందర్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది ఈ తనిఖీలు నిర్వహించారు. తోలుకట్టలోని వన్ వ్యూ ఫామ్‌హౌస్, వనం ఫామ్‌హౌస్, ప్రణవిల్లా ఫామ్‌హౌస్‌లతో పాటు సురంగల్‌లోని జెడ్ ఫామ్‌హౌస్, రాయల్ వుడ్ ఫామ్‌హౌస్‌లను తనిఖీ చేశారు.

అక్రమ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు

ఫామ్‌హౌస్‌లు, రిసార్టులు, ఇతర ప్రాంతాల్లో చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు హెచ్చరించారు. ప్రజల భద్రతకు విఘాతం కలిగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.