ఫామ్‌హౌస్‌లలో అక్రమ మద్యం కలకలం

ఫామ్‌హౌస్‌లలో అక్రమ మద్యం కలకలం 26 లీటర్ల మద్యం, నాలుగు హుక్కా పాట్స్‌ స్వాధీనం. మొయినాబాద్, అక్టోబర్ 25(ప్రజాక్షేత్రం):ఫామ్‌హౌస్‌లలో అక్రమ కార్యకలాపాలపై పోలీసులు కొరడా ఝళిపించారు. మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తోలుకట్ట, సురంగల్ గ్రామాల్లో పలు ఫామ్‌హౌస్‌లపై శనివారం రాత్రి నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో 26 లీటర్ల అక్రమ మద్యం, నాలుగు హుక్కా పాట్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలకు సంబంధించి ఫామ్‌హౌస్‌ల యజమానులు, పార్టీ నిర్వాహకులపై కేసులు నమోదు చేసి తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టారు. చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్,...