prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 25 October 2026, 3:46 pm Digital Edition : PRAJA KSHETRAM

మహిళల క్రీడా ప్రతిభకు ‘అస్మితా’ వేదిక

మహిళల క్రీడా ప్రతిభకు ‘అస్మితా’ వేదిక

రగ్బీ టోర్నీలో సెయింట్ మార్టిన్స్ జట్టుకు విజయం

నాగారం, అక్టోబర్ 25(ప్రజాక్షేత్రం): మహిళల్లో క్రీడా ప్రతిభను వెలికితీయడం, రగ్బీ క్రీడపై ఆసక్తిని పెంపొందించడమే లక్ష్యంగా అస్మితా ఖేలో ఇండియా కార్యక్రమంలో భాగంగా ఆదివారం నాగారంలో అస్మితా రగ్బీ సిటీ టోర్నమెంట్‌ను నిర్వహించారు. నాగారంలోని సెయింట్ మార్టిన్స్ హైస్కూల్ వేదికగా జరిగిన ఈ పోటీల్లో ఎనిమిది జట్లు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించాయి.

సెయింట్ మార్టిన్స్‌కు ప్రథమ స్థానం

ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోటీల్లో ఆతిథ్య సెయింట్ మార్టిన్స్ హైస్కూల్ జట్టు ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది. కేశవ మెమోరియల్ స్కూల్ జట్టు ద్వితీయ స్థానంలో నిలవగా, ఎంజేపీటీబీసీ రంగారెడ్డి జట్టు తృతీయ స్థానాన్ని దక్కించుకుంది.

క్రీడాకారులను ప్రోత్సహించిన ప్రముఖులు

కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, రగ్బీ ఇండియా, తెలంగాణ రగ్బీ, మేడ్చల్‌–మల్కాజిగిరి రగ్బీ సంస్థల ఆధ్వర్యంలో ఈ టోర్నమెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సెయింట్ మార్టిన్స్ గ్రూప్ అధినేత జై కిషన్ యాదవ్ హాజరయ్యారు. రగ్బీ అసోసియేషన్ తెలంగాణ కార్యదర్శి ఆదిత్య ఉత్పల్‌తో పాటు శివ, సాను తదితరులు పాల్గొని క్రీడాకారులను ప్రోత్సహించారు.

మహిళలకు మరిన్ని అవకాశాలు కల్పించాలి

మహిళా క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి, వారు ఉన్నత స్థాయి పోటీల్లో రాణించేలా ప్రోత్సహించేందుకు ఇలాంటి టోర్నమెంట్లు ఎంతగానో దోహదపడతాయని నిర్వాహకులు పేర్కొన్నారు. మహిళలకు క్రీడారంగంలో మరిన్ని అవకాశాలు కల్పించడం ద్వారా వారు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు మార్గం సుగమమవుతుందని తెలిపారు.