దూలపల్లిలో నిర్మాణాల జోరు..కొంపల్లి టౌన్‌ప్లానింగ్‌.. నిఘా ఏమైనట్లు?

షెడ్లు వెలుస్తున్నాయ్‌..నిఘా ఏమైనట్లు? వరుస కథనాలైనా స్పందనేదీ? అనుమతులపై అధికారులే స్పష్టత ఇవ్వాలి కుత్బుల్లాపూర్‌, అక్టోబర్‌ 26(ప్రజాక్షేత్రం):దూలపల్లిలో భారీ షెడ్ల నిర్మాణాలు.. వాటి అనుమతులపై సందేహాలు.. అయినా అధికారుల నుంచి స్పష్టత కరవు! పారిశ్రామిక వాడలోని దీపక్‌ స్టీల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ వద్ద రెండు భారీ షెడ్ల నిర్మాణాల వ్యవహారం కొంపల్లి సర్కిల్‌ టౌన్‌ప్లానింగ్‌ విభాగం పర్యవేక్షణ తీరును ప్రశ్నార్థకం చేస్తోంది. నిర్మాణాలపై వరుస కథనాలు వెలువడుతున్నా.. క్షేత్రస్థాయిలో తనిఖీలు జరిగాయా? నిబంధనల ఉల్లంఘనలు గుర్తించారా? చర్యలు తీసుకున్నారా? అన్నది ఇంకా తేలాల్సి ఉంది. కథనాలు...