- ఇక సబ్సిడీపై నిత్యావసరాలు కూడా.. సర్కార్ సూపర్ ప్లాన్!
హైదరాబాద్ అక్టోబర్ 27(ప్రజాక్షేత్రం):ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడి, బహిరంగ మార్కెట్‌లో నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ప్రజలపై ఆర్థిక భారం తగ్గించేందుకు కీలక సన్నాహాలు చేస్తోంది. వర్షాభావం వల్ల పంటల దిగుబడి తగ్గి సరుకుల ధరలు విపరీతంగా పెరగడంతో సామాన్యుల ఇంటి బడ్జెట్ తలకిందులవుతోంది. ఈ పరిస్థితుల నుంచి పేద, మధ్యతరగతి ప్రజలను గట్టెక్కించేందుకు రేషన్ దుకాణాల ద్వారా బియ్యంతో పాటు కందిపప్పు, గోధుమ పిండి, పంచదార, పామాయిల్, చింతపండు, కారంపొడి వంటి నిత్యావసర సరుకులను అతి తక్కువ సబ్సిడీ ధరలకే పంపిణీ చేసేందుకు పౌరసరఫరాల శాఖ సమగ్ర కార్యాచరణ రూపొందిస్తోంది.