లంచం తీసుకుంటూ ఎసిబికి చిక్కిన మీర్‌చౌక్ ఇన్‌స్పెక్టర్, హోమ్‌గార్డ్

హైదరాబాద్ అక్టోబర్ 27(ప్రజాక్షేత్రం):కేసును మూసివేసేందుకు రూ.6 లక్షల లంచం డిమాండ్ చేసిన మీర్‌చౌక్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఎం. కొండల్ రావు, హోమ్‌గార్డ్ అబిద్ అలీని ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రూ.3 లక్షల లంచం తీసుకుంటుండగా సిటీ రేంజ్-1 ఏసీబీ యూనిట్ అధికారులు మంగళవారం దాడి చేసి ఇద్దరినీ అరెస్టు చేశారు. ఏసీబీ అధికారుల వివరాల ప్రకారం, ఫిర్యాదుదారుడి తండ్రిపై మీర్‌చౌక్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసును మూసివేయడంతో పాటు, కఠిన చర్యలు తీసుకోకుండా ఉండేందుకు, భవిష్యత్తులో సహకరించేందుకు ఇన్‌స్పెక్టర్...