ఈటల మహా పాదయాత్ర.. జవహర్‌నగర్ డంపింగ్‌ యార్డు తరలింపుపై సమరం!

మల్కాజ్‌గిరి అక్టోబర్ 30(ప్రజాక్షేత్రం):జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్‌ను వెంటనే తరలించాలని డిమాండ్ చేస్తూ మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ చేపట్టిన మహా పాదయాత్ర నాలుగో రోజుకు చేరింది. గత 30 ఏళ్లుగా రోజుకు సుమారు 10,000 మెట్రిక్ టన్నుల వ్యర్థాల వల్ల పరిసర ప్రాంతాల ప్రజల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటోందని, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించే వరకు బీజేపీ ఆధ్వర్యంలో పోరాటం ఆపేది లేదని ఆయన స్పష్టం చేశారు. తాను పనిలేక తిరుగుతున్నానంటూ విమర్శిస్తున్న కాంగ్రెస్ నాయకులకు ఈటల ఘాటుగా సమాధానమిచ్చారు. ఈ డంప్...