శంకర్‌పల్లిలో భారీ వర్షం.. జలమయమైన రహదారులు!
శంకర్పల్లి అక్టోబర్ 30(ప్రజాక్షేత్రం):శంకర్పల్లి పట్టణంలో కురిసిన భారీ వర్షంతో ప్రధాన రహదారులు తడిసి ముద్దయ్యాయి. రహదారులపై వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు, ద్విచక్ర వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షం కారణంగా పట్టణంలోని ప్రధాన వ్యాపార సముదాయాల పరిసరాల్లో రహదారులపై నీరు చేరింది. వాహనాలు నెమ్మదిగా ప్రయాణించడంతో ట్రాఫిక్‌పై ప్రభావం పడింది. ద్విచక్ర వాహనదారులు అప్రమత్తంగా ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది.