షాద్నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో విషాదం.. తల్లీబిడ్డ మృతి!
వైద్య సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని భర్త ఆరోపణ. సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి! ఎమ్మార్పీఎస్ కొందుర్గ్ మండల సీనియర్ నాయకులు ఆనేగాళ్ళ ఆనంద్ మాదిగ. కొందుర్గ్ అక్టోబర్ 30(ప్రజాక్షేత్రం):కొందుర్గ్ మండలం చెరుకుపల్లి గ్రామానికి చెందిన మల్లని రమేష్ కుమార్, రాధా దంపతులు ప్రసవం కోసం ఆసుపత్రికి వెళ్లగా, చివరకు తల్లి, కడుపులోని బిడ్డ ఇద్దరూ ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం. బాధితురాలి భర్త రమేష్ కుమార్ ఆరోపణల ప్రకారం.. తొలుత కొందుర్గ్ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లిన వారికి షాద్నగర్ ప్రభుత్వ...