అమ్డాపూర్ను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా
గ్రామ సర్పంచ్ మద్యపాగ క్రిష్ణ. మొయినాబాద్, నవంబర్ 01(ప్రజాక్షేత్రం):గ్రామ అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ అమ్డాపూర్ను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని గ్రామ సర్పంచ్ మద్యపాగ క్రిష్ణ తెలిపారు. మండల పరిధిలోని అమ్డాపూర్ గ్రామంలో ఆదివారం విద్యుత్ సమస్యల పరిష్కారానికి నూతన కరెంట్ స్తంభాలను ఏర్పాటు చేయించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… గ్రామ ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ పాలకవర్గం, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.